KMR: ఎల్లారెడ్డి మండలం బాలాజీ నగర్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరచూ మద్యం సేవించి వేధిస్తున్నాడనే కోపంతో నిద్రిస్తున్న భర్త రత్నావత్ తుకారం (40)ను భార్య మీన హతమార్చింది. ఈ విషయాన్ని సీఐ రాజారెడ్డి బుధవారం తెలిపారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.