ప్రపంచంలో అత్యంత అరుదైన పుష్పాలలో రాఫ్లేసియా ఒకటి. అతిపెద్ద పుష్పమైన ఇది.. ఇండోనేషియాలోని సుమత్రా వర్షారణ్యంలో మాత్రమే దొరుకుతుంది. అయితే 13 ఏళ్ల తర్వాత.. ప్రస్తుతం దీనిని బయాలజిస్టు సెప్టియన్ ఆండ్రిక్ కనుగొన్నారు. ఇది దాదాపు 9 నెలల పాటు పెరుగుతోంది. ఈ పుష్పం కుళ్లిన మాంసం లాంటి వాసనను వెదజల్లుతోంది. ఈ వాసన వల్ల ఈగలు ఆకర్షితులై పరాగసంపర్కం చేస్తాయి.