MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ – దంతేపల్లి ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, కంకర రాళ్లతో ప్రయాణానికి అత్యంత ఇబ్బందికరంగా తయారైంది. ఈ మార్గంలో నిత్యం జిల్లా ప్రజలు కామారెడ్డి పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే అవస్థ పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. గతంలో నిధులు మంజూరైనా పనులు చేపట్టలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.