BDK: అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలో జీపీహెచ్ఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పాఠశాలల భద్రత విద్యార్థుల అభివృద్ధి శుభ్రత పరిశుభ్రత విషయంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం ఎంతో అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.