TPT: సత్యవేడు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామనే హామీని నెరవేర్చాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. సత్యవేడు క్లాక్ టవర్ సాక్షిగా 2024 ఏప్రిల్ 20న చంద్రబాబు తన పుట్టినరోజు నాడు ఎన్నికల బహిరంగ సభలో సత్యవేడును డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇవాల్టి సమావేశంలో సత్యవేడు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.