కృష్ణా: తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో రోడ్డుపై స్పష్టంగా కనపడే విధంగా ప్లాస్టిక్ డ్రమ్లకు రేడియం స్టిక్కరింగ్ ఏర్పాటు చేశారు. రేడియం స్టిక్కర్లు వాహనదారులకు ముందుగానే హెచ్చరికలు అందజేసే విధంగా ఉండడంతో ప్రమాదాలు నిలువరించే అవకాశం ఉంది.