HYD: నగరానికి తాగునీరు అందించే కృష్ణా ఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్లలో కొత్త విద్యుత్ ఫీడర్లు, ట్రాన్స్ ఫార్మర్లను అమర్చే పనులు చేస్తున్నారు. ఈ కారణంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. చార్మినార్, ఎస్ఆర్ నగర్, హయత్నగర్, ఉప్పల్, మిర్పేట్ మరికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు.