CTR: చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలపై 32 వినతులు అందినట్లు వెల్లడించారు. అధికంగా భూతగాదాలపై 10, నగదు లావాదేవీలపై 10 ఫిర్యాదులు అందినట్లు తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు.