మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎంఈడీ ప్రవేశాల ఫస్ట్ ఫేజ్లో అవకాశం కోల్పోయిన బీఎడ్ విద్యార్థుల కోసం 3వ దశ కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణకు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.