MDK: చిన్నశంకరంపేట మండలం చందంపేట పీఏసీఎస్ కార్యాలయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఐదేళ్ల లెక్కలు కోరుతూ మాజీ వార్డు సభ్యులు కుమ్మరి ప్రవీణ్ కుమార్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సీఈఓ పాషాకు దరఖాస్తు చేశారు. అయితే, “ఆర్టీఐ చట్టం సొసైటీలకు వర్తించదు” అంటూ సీఈఓ ఆ దరఖాస్తుపై రాసివ్వడం విమర్శలకు తావిచ్చింది.