KRNL: డయల్ యువర్ APSPDCL సీఎండి కార్యక్రమంలో ఛైర్మన్ ఎండీ శివశంకర్ సోమవారం 65 వినతులు స్వీకరించారు. కర్నూలు సర్కిల్ నుంచి అత్యధికంగా 17 సమస్యలు అందాయని ఆయన తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లో-ఓల్టేజ్, ట్రాన్స్ ఫార్మర్ మార్పు వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.