సిమ్ కార్డు వినియోగదారులకు టెలికాం విభాగం కీలక హెచ్చరిక చేసింది. సైబర్ మోసాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఏ సిమ్ కార్డు వినియోగించినా సిమ్ ఎవరి పేరిట ఉంటే వారే బాధ్యులని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాత సిమ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. టెలీ కమ్యూనికేషన్ నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా ఉంటుందని వెల్లడించింది.