MLG: వెంకటాపురంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం వద్ద ఓ పాము కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ధాన్యం కల్లం దగ్గరకు వెళ్లిన కొందరు రైతులకు ‘బ్యాండెడ్ క్రైట్’ అనే ఓ అరుదైన పాము రైతులను భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన రైతులు ఆత్మరక్షణలో భాగంగా పామును హతమార్చినట్లు తెలిపారు. అత్యంత విషపూరితమైన ఈ పాము ఆగ్నేయాసియాలో కనిపిస్తాయని పలువురు తెలిపారు.