ఖమ్మం వన్ టౌన్ ఎస్సై మౌలానా తన సిబ్బందితో ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, సోమవారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఒరిస్సాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి పూణేలో అమ్ముతున్నట్లు వారు అంగీకరించారు. వారి నుంచి 50.137 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.