W.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులగణన, ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశి కోరారు. ఈ మేరకు సోమవారం భీమవరం కలెక్టరేట్లో జరిగిన PGRSలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వర్గీకరణ ద్వారానే ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.