ATP: ప్రతి శుక్రవారం ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను కట్టించాలన్నారు.