సిద్దిపేట జిల్లాలో మొత్తం 508 గ్రామాలకు సర్పంచులు, 4,508 వార్డు సభ్యుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేసి ప్రభుత్వానికి పంపించింది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఆయా మండలాల రాజకీయ పార్టీల నేతల సమక్షంలో ఆదివారం డ్రాలు తీశారు. జనరల్‌కు 254, బీసీలకు 132,ఎస్సీలకు 97,ఎస్టీలకు 25 సర్పంచ్ స్థానాలు కేటాయించారు.