అమెరికా వీసా రద్దు కావడంతో గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో పీజీ చేసేందుకు ఆమె జే1 వీసాకు దరఖాస్తు చేశారు. అయితే, HYDలోని కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్లో ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన రోహిణి ఈనెల 22న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.