CTR: కుప్పం మున్సిపాలిటీ తంజమ్మ కొట్టం శ్రీరంగనాథ స్వామి ఆలయ ముఖ ద్వారాన్ని ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఆలయ ముఖ ద్వారం రాతి కూసాలు ధ్వంసమయ్యాయి. రాత్రి 11.50 గంటల ప్రాంతంలో షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టినట్లు CC ఫుటేజ్ ద్వారా గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.