WGL: ఉమ్మడి జిల్లా గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీతో సందడి నెలకొంది. మహిళలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కనిపిస్తోంది. వచ్చే నెల స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల ప్రకటనతో రాజకీయ సందడి మరింత పెరిగింది.