BPT: సూర్యలంక తీరంలో దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్న కుటుంబాలకు తాత్కాలిక ఖాళీ నోటీసులు రావడంతో దుకాణదారులు తహసిల్దార్ సలీమాను కలిసి అర్జీ ఇచ్చారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక అదే స్థలంలో దుకాణాలు పునరుద్ధరించేందుకు అవకాశం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. సలీమా అర్జీ స్వీకరించి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.