భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్రేలియా ఓపెన్ 2025 విజేతగా నిలిచాడు. యూషీ తనకా(జపాన్)పై మెన్స్ సింగిల్స్ ఫైనల్లో 21-15, 21-11తో విజయం సాధించాడు. దీంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న మూడో భారత బ్యాడ్మింటన్ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఇండియా ఓపెన్-2022, కెనడా ఓపెన్-2023 తర్వాత అతనికిది మూడో సూపర్ 500 టైటిల్.