CTR: జిల్లాలో 16 తహసీల్దార్ కార్యాలయాల మరమ్మతులకు రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఎస్ఆర్ పురం, యాదమరి, గుడిపాల, చిత్తూరు అర్బన్, సోమల, పూతలపట్టు, పుంగనూరు, వి.కోట, సదుం, బైరెడ్డిపల్లి, చౌడేపల్లి, గంగవరం, నిండ్ర, విజయపురం, ఐరాల, బంగారుపాళ్యం తహసీల్దార్ కార్యాలయాలలో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Tags :