ELR: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెవ్వి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లు, మెడికల్ కాలేజీ విద్యార్ధులు గాని ఒక్క ఫిర్యాదు చేసినా వెనువెంటనే విచారణ చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.