విశాఖ వేదికగా భారత క్రికెట్ జట్టు డిసెంబర్ 6న సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్ ఆడనుంది. పర్యాటక జట్టుతో ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేల సరీస్‌లో భాగంగా ఈ చివరి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టికెట్ల విక్రయం ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 22 వేల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. మ్యాచ్ కోసం ఇరుజట్లు DEC 4న విశాఖకు చేరుకుంటాయి.