SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి వికలాంగులకు విలువలేకుండా పోయిందని దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కేమ్మ సారం అశోక్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రతి డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సంవత్సరాల నుంచి వికలాంగుల దినోత్సవం జరపకపోవడం దారుణమని ఆవేదన వ్యకం చేశారు.