TG: రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. మైలార్దేవ్ పల్లిలో బాబుల్ రెడ్డి నగర్‌కు చెందిన అభయ్ అనే 8వ తరగతి విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. మైదానంలో ఆడుకుంటూ.. స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.