NLG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సాధికారతకు, ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ నల్గొండ కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.