AP: సత్యసాయి తన సందేశాలతో చాలామందిలో పరివర్తన తెచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. నీటి సమస్య లేకుండా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని, ఒక మంచి పని చేస్తున్నామంటే చాలామంది ముందుకొచ్చి సాయం చేస్తారని తెలిపారు. విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారని గుర్తుచేశారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని, అనేక గ్రామాలకు తాగునీరు అందించారని పేర్కొన్నారు.