TG: మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. అధిష్ఠానం పెద్దలు చెప్పిన అంశాలపై చర్చిస్తున్నారు. చర్చల తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన నోటీసులకు దానం సమాధానం ఇవ్వనున్నారు. పార్టీ ఫిరాయింపు అనర్హతపై సుప్రీం ఆదేశాలతో స్పీకర్ విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే దానం, కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చారు.