MDK: హసన్ మీరాపుర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త దామరపల్లి మధుసూదన్ రెడ్డి తమ్ముడు మరణించారు. ఈ విషయం తెలిసి ఎంపీ రఘునందన్ రావు వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం తెలిపారు. దివంగతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీతో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.