జైషే ఉగ్రసంస్థకు చెందిన హ్యాండ్లర్ హంజుల్లా సాయంతో డాక్టర్ ఉమర్ మిగిలిన వైద్యులను ఉగ్రవాదులుగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. హంజుల్లా ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. అలాగే జమ్మూలో ఏర్పాటైన జైషే పోస్టర్లలో ‘కమాండర్ హంజుల్లా భాయ్’ అని పేరు రాసి ఉన్నట్లు తెలిపారు. దీంతో మిగిలిన హ్యాండర్ల కోసం గాలిస్తున్నారు.