MNCL: మంచిర్యాలలోని మార్క్స్ భవన్లో ఈ నెల 26, 27 తేదీలలో జరగనున్న పీడీఎస్యూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ పిలుపునిచ్చారు. శుక్రవారం లక్షెట్టిపేటలో ఆయన మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాసభలలో విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.