ఎప్పుడైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారని రాజమౌళి ప్రకటించారో.. అప్పటి నుంచి ఫ్యాన్స్ కొట్టుకుంటునే ఉంటున్నారు. సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్ వార్ కాస్త పీక్స్‌కు వెళ్లిపోయింది. ఈ విషయంలో రాజమౌళి కూడా టార్గెట్ అయ్యాడు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికీ చరణ్, ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపిస్తునే ఉన్నారు.. నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులెస్తునే ఉన్నారు. దాంతో ఈసారి ఆస్కార్ రావడం పక్కా అంటున్నారు. ఇది ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. అయితే దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అభిమానులు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. చెక్ డీఎం.. డీఎం ఓపెన్ చేయండి అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే అసలు ఎవరు ఎవరిని ట్రోల్ చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. అనే విషయం అంతుపట్టకుండాపోయింది. కానీ దానికి అసలు రీజన్ ఇదే అంటున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘విరూపాక్ష’ టైటిల్ గ్లింప్స్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇదే విషయాన్ని తేజ్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అని పేర్కొన్నాడట. ఇదే చరణ్ ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదట. దీంతో మెగాభిమానులు సాయి ధరమ్ తేజ్ చేత ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ మెసేజ్ ఎడిట్ చేయించారట. అందుకే చరణ్, తారక్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్దం ఓ రేంజ్లో జరుగుతోందని అంటున్నారు. ప్రస్తుతం చెర్రీ, తారక్ ఫ్యాన్స్ ఎడిట్ చేసిన చిత్ర విచిత్రమైన ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అయినా ఈ మధ్య.. ప్రతీ చిన్న విషయానికి అభిమానుల మధ్య అనవసర వాదన ఎక్కువైపోతోందనే చెప్పాలి.