»Crypto Scam Rs 2 Crore In 2 Months Hyderabad Businessman Falls For Online Bait
Crypto scam: ఫేస్బుక్ లింక్‌పై క్లిక్ చేశాడు.. అత్యాశకు పోయి రూ.2కోట్లు పోగొట్టుకున్నాడు
తెలంగాణాలో పెద్ద సైబర్ మోసం(cyber fraud) వెలుగు చూసింది. రెండు నెలల్లో ఓ వ్యాపారికి రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీ రాబడులు వస్తాయని నమ్మించి వ్యాపారవేత్త(businessman)ను కంపెనీ ఆకర్షించింది.
Crypto scam:తెలంగాణాలో పెద్ద సైబర్ మోసం(cyber fraud) వెలుగు చూసింది. రెండు నెలల్లో ఓ వ్యాపారికి రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీ రాబడులు వస్తాయని నమ్మించి వ్యాపారవేత్త(businessman)ను కంపెనీ ఆకర్షించింది. క్రిప్టో ట్రేడింగ్ పోర్టల్స్(crypto trading portals)లో పెట్టుబడి(Investment) పెట్టమని బాధితుడిని బలవంతం చేసింది. అత్యాశతో వ్యాపారి వారి వలలో చిక్కుకుని భారీ నష్టాన్ని చవిచూశాడు. వ్యాపారవేత్త రాకేష్ (పేరు మార్చాం)(Rakesh) పోలీసులను సంప్రదించి మార్చి 6 నుంచి మే 17 మధ్య క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ద్వారా రూ.2 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పాడు. మార్చి 6న తన ఫేస్బుక్ పేజీని బ్రౌజ్ చేస్తున్నప్పుడు బిట్‌కాయిన్ ట్రేడింగ్‌పై ప్రకటన కనిపించిందని రాకేష్ పోలీసుల(police)కు చెప్పాడు. అతను ప్రకటనలో లింక్‌ను చూసి దానిపై క్లిక్ చేశాడు. దీనిలో బిట్‌కాయిన్ వెబ్సైట్ లింక్‌తో వాట్సాప్ చాట్ పేజీకి మళ్లించబడింది. వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాత కంపెనీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.
రిటర్న్‌లపై కంపెనీ నిషేధం విధించింది
మార్చి 6 నుండి మే 17 వరకు అతడు 20.6 మిలియన్ల డాలర్ల విలువైన USDTని కొనుగోలు చేశాడు. అతను తన డబ్బును విత్‌డ్రా చేయాలనుకున్నప్పుడు, కంపెనీ తన ఉపసంహరణను నిషేధించింది. దీంతో తానుమోసానికి గురయ్యనని గ్రహించాడు.
పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు
తాను డిపాజిట్ చేసిన మొత్తానికి బదులు రూ.10 కోట్లు వస్తాయని కంపెనీ ఆశ కల్పించిందని కూడా బాధితుడు పోలీసులకు తెలిపాడు. కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లు పోలీసులకు వివరించాడు. ఈ విషయంపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 419 (వంచన ద్వారా మోసం చేయడం), 420 (మోసం), ఐటీ చట్టంలోని 66 కింద కేసు నమోదు చేశారు.