Director Harish Shankar Serious On Reporter At 2018 Preview
Director Harish Shankar: మళయాళ సినిమా 2018 తెలుగులో విడుదలకు సిద్ధమైంది. మే 26వ తేదీన ఈ మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ముందుగా మూవీ ప్రివ్యూ ప్రదర్శించారు. ఈ మూవీకి తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కొనుగోలు చేశారు. ఈ మూవీ ప్రివ్యూకి బన్నీ వాసుతోపాటు డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కూడా హాజరయ్యారు.
ఆ సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) సీరియస్ అయ్యారు. డబ్బింగ్ సినిమా అని అనడంతో ఆయనకు కోపం వచ్చింది. ‘2018ను అనువాద చిత్రం అని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ చిత్రాలను హిందీలో ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా..! డబ్బింగ్ లేదా రీమేక్ సినిమా అనేది లేదు. కేవలం సినిమా అంతే. నేటి రోజుల్లో సినిమా ఎక్కడికైనా వెళ్తున్నందుకు మనం ఎంతో సంతోషించాలి. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఇలాంటి ప్రశ్న వేశారంటే జాలిగా ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు దర్శకుల వైపు చూస్తోంది. ఆయన కేరళ దర్శకుడని నేను ఈ సినిమా చూడలేదు. ఆయన వర్క్ నాకెంతో నచ్చింది. సినిమాలో ఒక ఎమోషన్ ఉంది అది నచ్చి ప్రశంసించాలని వచ్చా.-
‘గీతాఆర్ట్స్’ డబ్బింగ్ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు? వరుసగా 100 డబ్బింగ్ సినిమాలు బన్నీవాసుతో తనే రిలీజ్ చేయిస్తా. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాని పది మందికి చూపించాలని చేసే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఈ సినిమాని ముందు మీకే చూపించాలని బన్నీ వాసు అనుకున్నారు. ఎందుకంటే సినిమా మీకు నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్ నిర్మాత కూడా చేయలేరు. డబ్బింగ్ లేదా రీమేక్ అనేది విషయం కాదు. మంచి సినిమాలు చేస్తున్నామా? లేదా? అనేది ముఖ్యం’ అని హరీశ్ శంకర్ (Harish Shankar) అన్నారు.
‘‘చులకన చేసే నోరు ఉన్నప్పుడు… చురకలు వేసే నోరు కూడా ఉంటుంది. తెలుగు సినిమా ఉన్నత స్థాయిలో ఉందిప్పుడు. దానిని అవమానిస్తే చూస్తూ ఊరుకోలేం. మన పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడొద్దు. ఏ భాషాలో తీసిన చిత్రమైన నచ్చితే ఆ సినిమాను, మేకర్‌ను ప్రశంసించండి. దాని ముందు మన పరిశ్రమను తక్కువ చేయొద్దు’’ అని హరీశ్ శంకర్ (Harish Shankar) అన్నారు.