The Kerala Story : ది కేరళ స్టోరీ.. బాక్సాఫీస్ రికార్డ్ వసూలు
సినిమా విడుదలకు ముందు నుంచే అనేక నిరసనలు ఆందోళనలు. అయినా చిత్రాన్ని ఎలాగోలా విడుదల చేసేశారు. ఆ సినిమాలే ది కేరళ స్టోరీ(The Kerala Story) మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరి (The Kerala Story) సినిమా కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ మూవీ 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఒక్కరోజు రూ.11.50 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం వసూళ్లు సునామి సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో విపరీతంగా వివాదంలో చిక్కుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది ది కేరళ స్టోరీనే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి మూవీపై పలు విమర్శలు తలెత్తాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను బ్యాన్ కూడా చేశారు. ఇంత వివాదాల నడుమ చిన్న సినిమాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా..సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అదా శర్మ (Ada Sharma) కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ 200 కోట్ల క్లబ్లో చేరింది.
లవ్ జిహీది (Lav jihidi) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా అన్ని రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది. కేరళలో కనిపించుకుండా పోయిన ముగ్గురు అమ్మాయిలు తీవ్రవాద సంస్థలోకి ఎలా వెళ్లారు అనేది కథాంశం. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ చాలా స్టేట్స్లో ధర్నాలు రాస్తారోకోలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు చేశారు. ఇక వెస్ట్ బెంగాల్ (West Bengal) లాంటి రాష్ట్రాలు మాత్రం సినిమాను ఏకంగా బ్యాన్ చేశాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా కలుగజేసుకుని షోలు వేయాలంటూ మొట్టికాయలు వేసింది. ఈ సినిమాను ఎంత ఆపాలని చూశారో సినిమా అంత దూసుకెళ్లింది. సుదీప్తో సేన్ (Sudipto Sen) డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఈ స్థాయిలో రికార్డ్ కొడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఊహకందని రికార్డ్ క్రియేట్ చేసిన ది కేరళ స్టోరీ కలెక్షన్స్ మార్క్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.