ADB: రూరల్ మండలంలోని బెల్లూరిలో ఆలయంలో అయ్యప్ప సేవా సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కాగా గురు స్వామి చందా గణేష్ ప్యానెల్ మరోసారి ఘన విజయం సాధించి పట్టు నిలుపుకుంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో గురు స్వామి చందా గణేష్ తన ప్రత్యర్థి పుప్పాల నరేందర్‌పై 342 ఓట్ల మెజార్టీతో నూతన అధ్యక్షునిగా విజయం సాధించారు.