AP: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. జైలు ప్రాంగణంలోని 8 ఎకరాల్లో 20 మంది ఖైదీలు సాగు బాధ్యతలు చూస్తున్నారు. ఇలా పండించిన ఉత్పత్తుల ద్వారా నెలకు రూ.1.20 లక్షల ఆదాయం వస్తుండగా, అందులో రూ.లక్ష విలువైన కూరగాయలను బయట ప్రజలకు విక్రయిస్తున్నారు. మిగిలిన రూ.20 వేల విలువైన ఉత్పత్తులను జైల్లోని ఖైదీల ఆహార అవసరాలకు వినియోగిస్తున్నారు.