GDWL: జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆదివారం ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శీతాకాలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నేషనల్ హైవేపై నిర్వహించిన తనిఖీల్లో 42 కేసులు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు.