ప్రకాశం: తూర్పు గంగవరంలోని చీమకుర్తి ప్రధాన రహదారిలో ఎస్సై మల్లికార్జున రావు ఇవాళ వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెంట్ తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు. ట్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేరెంట్స్ పిల్లలకు వాహనాలు ఇస్తే ఉపేక్షించేది లేదని ఎస్సై తెలిపారు.