SRD: మిషన్ భగీరథ అరకొర నీటి సరఫరా, చేతి పంపులు ఉన్న పని చేయవు. త్రి ఫేజ్ కరెంటు మోటార్ కాలిపోయి రిపేర్కు నోచుకోవడం లేదని కంగ్టి మండలం జంగి(బి) గ్రామస్తులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర్లో వ్యవసాయ బోర్లు కూడా లేకపోవడంతో, తాగునీటి సమస్యతో సతమతమవుతున్నట్లు చెప్పారు. పంచాయతీ కార్యదర్శికి చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే రిపేరు చేయాలని కోరారు.