హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వలన ఓ యువతికి మానసిక క్షోభ కలిగించింది. In vitro fertilization (IVF) టెస్ట్ లు సరిగ్గా చేయనందువలన బాధితురాలు ఏకంగా సిట్జర్లాండ్ (Switzerland) నుంచి భారత్ కు పలుమార్లు తిరగవలసి వచ్చింది. వివరాళ్లోకి వెలితే… కర్ణాటకకు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకుని స్విట్జర్లాండ్ లో నివసిస్తోంది. ఆమెకు గర్భం రాకపోవడంవలన బెంగళూరులోని ( Bengaluru ) ఓ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం సంప్రదించారు. బెంగళూరుకు వచ్చి టెస్ట్ లు చేయించుకోవాలని హాస్పిటల్ వర్గాలు ఆ మహిళకు తెలిపారు. మార్చి 19 2018న స్విస్ నుంచి బెంగళూరుకు చేరుకుని హాస్పిటల్ లో చూయించుకున్నారు.
బయాప్సీ కోసం నమూనాలు సేకరించిన హాస్పిటల్ సిబ్బంది 10రోజుల్లో రిపోర్ట్స్ ఇస్తామని చెప్పారు. దీంతో సదరు మహిళ స్విట్జర్లాండ్ కు వెళ్లిపోయారు. 10రోజుల తర్వాత డాక్టర్ ఫోన్ చేసి ల్యాబ్ సిబ్బంది పొరపాటువలన తీసుకున్న నమూనా చెడిపోయిందని చెప్పారు. మరోసారి భారత్ కు వచ్చి నమూనాలను ఇవ్వాలని… ఈ సారి ఉచితంగా టెస్టులు చేస్తామని చెప్పారు.
దీంతో దంపతులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ల్యాబ్ నిర్లక్షాన్ని గుర్తించిన ఫోరం అధికారులు టికెట్ ఖర్చు రూ.47,991ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించారు. ఏప్రిల్ 29న తీర్పును వెలువరించింది. విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది.