»Telangana Four Brothers Died On The Spot In A Road Accident Aurangabad Maharashtra
Four brothers died: రోడ్డు ప్రమాదంలో నలుగురు బ్రదర్స్ స్పాట్ డెడ్
బంధువుల కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు సోదరులు మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
బంధువుల అంత్యక్రియలకు వచ్చి వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత చెందారు. అయితే మరణించిన వారు ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నదమ్ములు కావడం విశేషం. ఈ యాక్సిడెంట్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రమాదంలో మృతి చెందిన వారు తెలంగాణ సిద్ధిపేట జిల్లా చౌట్ పల్లికి చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఎరుకల కృష్ణ, సురేష్, వాసు, సంజీవ్ ఉన్నారు. వీరంతా జీవనం నిమిత్తం సూరత్‌లో ఉంటుండగా బంధువుల కార్యక్రమానికి వచ్చిన నేపథ్యంలో ప్రమాదం జరిగింది.
అయితే వీరు ఐదు రోజుల ముందు వీరి స్వస్థలమైన చౌటుపల్లికి వెళ్లారు. అక్కడ వారి బంధువైన ఎరుకల రాములు మరణించగా..అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను అక్కడే ఉంచారు. అన్నదమ్ములు తిరిగి సూరత్ మంగళవారం కారులో బయలు దేరారు.
ఆ క్రమంలోనే రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ చేరుకున్న తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే సారి మృత్యువాత చెందడంతో వారి గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. దీంతో వారి బంధువులు బోరున విలపిస్తున్నాయి.