SKLM: జ్ఞానాన్నిపెంపొందించుకోవాలంటే గ్రంథాలయాలను వినియోగించుకోవాలని నందిగాం మండలం ఎంఈవో 2 చిన్నారావు అన్నారు. గ్రంథాలయాల వారోత్సవాలలో భాగంగా నందిగాం శాఖా గ్రంథాలయంలో ఇవాళ జరిగిన పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు సత్తారు ఉదయకిరణ్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.