ATP: హిందూపురంలో YCP కార్యాలయంపై జరిగిన దాడిని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకులు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికే ‘బ్లాక్ డే’ అని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనడానికి ఈ దాడులే నిదర్శనమని ఆయన విమర్శించారు.