E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో ఏటా నిర్వహించే బంగారు పాపమ్మ తల్లి 5 రోజుల ఉత్సవాలకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా SP ఆదేశాల మేరకు శనివారం అడిషనల్ SP ఏవీ సుబ్బరాజు పర్యవేక్షణలో DSP దేవకుమార్, CI విజయ్ బాబు, SI రామకృష్ణ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భక్తులు పోలీసులకు సహకరించాలని SI రామకృష్ణ కోరారు.