BDK: ములకలపల్లి మండలంలో ఇవాళ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడం ముఖ్య ఉద్దేశమని ఎంపీ రామ సహాయం తెలిపారు. విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.