NZB: భీమగల్ పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్లను మున్సిపల్ కమిషనర్ గంగాధర్ శనివారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన డబ్బులను దశలవారీగా ప్రతి సోమవారం ఖాతాలో జమ చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలిపారు. ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టని వారు నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.