HYD: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నవంబర్ 16న నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. సమాచా, ప్రజా సంబంధాల శాఖ, మీడియా అకాడమీ సంయుక్తంగా ఈ వేడుకను ఏర్పాటు చేస్తున్నాయి. ఉదయం 10:30కి జర్నలిస్టులు హాజరుకావాలని IPR అధికారులు కోరారు. ఈ కార్యక్రమానికి I&PR ప్రత్యేక కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.